![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -131 లో..... మనీషా తన అన్నకి లంచ్ బాక్స్ తీసుకొని సైట్ దగ్గరికి వస్తుంది. మీ కోసం బిర్యాని చేసానని మనీషాకి మాధవ బిర్యాని ఇస్తాడు. బిర్యాని బాగుందని మనీషా అంటుంది. ఇలా మీతో మాట్లాడుతు నేను హిందీ నేర్చుకుంటానని మాధవ అంటాడు. ఆ తర్వాత కన్నాకి బాగా జ్వరం రావడంతో మహా ట్యాబ్లెట్స్ కోసం చూస్తుంటే అక్కడ ట్యాబ్లెట్స్ ఉండవు. దాంతో నారాయణని తీసుకొని రమ్మని మహా పంపిస్తుంది. నారాయణ ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాక కన్నాకి మహా దగ్గరుండి మరి ట్యాబ్లెట్స్ వేసి తన చున్నీతో కన్నాని తుడుస్తుంది. అదంతా అప్పుడే వచ్చిన మాధవ, కేశవ చూస్తారు.
ఈ రోజు వదిన నన్ను అమ్మలాగా చూసుకుందని వాళ్ళు రాగానే కన్నా చెప్తాడు. అప్పుడే మహా వస్తుంది. హమ్మయ్య వచ్చారా.. ఒకవేళ కన్నాకి జ్వరం బాగా వస్తే ఎలా అని అనుకున్నాను.. మీరే వచ్చారని మహా అంటుంది. ఆ తర్వాత కేశవకి చక్రి ఫోన్ చేసి.. నేను రావడానికి లేట్ అవుద్దని చెప్తాడు. అందరు భోజనం చేస్తుంటారు. చక్రి ఇంకా రాలేదని మహా అడుగుతుంది. వాడికి లేట్ అవుతుందని చెప్పాడని కేశవ చెప్తాడు ఆ తర్వాత అందరు భోజనం చేసి పడుకుంటారు. మహా మాత్రం చక్రి కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే చక్రి వస్తాడు. ఎందుకు ఇంత లేట్ అయిందని మహా అడుగుతుంది. వేరే ట్రిప్ కి వెళ్ళానని చక్రి చెప్తాడు. ఆ తర్వాత చక్రి దగ్గరికి కేశవ వచ్చి.. ఒరేయ్ తనని గమనించావా తను నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. తను నిన్ను ప్రేమిస్తున్నట్లు ఉంది అని కేశవ అనగానే చక్రి సిగ్గుపడతాడు.
ఆ తర్వాత మరుసటిరోజు మహాని తీసుకొని చక్రి ఇంటర్వ్యూకి వెళ్తాడు. మహా స్టెప్స్ ఎక్కుతుంటే ఒకతను డాష్ ఇస్తాడు. మరి ఇంత అందం గ్లామర్ ఉంటే ఎలా అని అంటాడు. దాంతో మహా అతనిపై సీరియస్ అవుతుంది. తీరాచూస్తే అతని దగ్గరికే మహా ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇక నాకు జాబ్ వచ్చినట్లే అని మహా తిరిగివెళ్తుంటే అతను పిలిచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు సెలెక్టెడ్ అని అంటాడు. మీ ప్రొపైల్ చూసే సర్ ముందే అప్పాయింట్ చేసాడని అక్కడ వర్క్ చేసే ఆవిడ వచ్చి అప్పాయింట్ మెంట్ లెటర్ ఇచ్చి వెళ్తుంది. తరువాయి భాగంలో మహా జాబ్ వచ్చిందని ఇంట్లో అందరికి బట్టలు తీసుకొని వస్తుంది. చక్రికి మాత్రం స్పెషల్ గా వచ్చి బట్టలు ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |